దృశ్యం 2 మొదలైంది

Drushyam 2

వెంకటేష్ కి రీమేక్ రాజా అన్న పేరు ఉంది. ఆయన కెరీర్లో అధిక శాతం హిట్ చిత్రాలు రీమేక్ మూవీస్. అలా ఆయన చేసిన రీమేకుల్లో ఒకటి…’దృశ్యం’. ఆ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. ఇది కూడా మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ సినిమాకి రీమేక్. ఒరిజినల్ మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులోనూ డైరెక్ట్ చేస్తున్నాడు.

మార్చి 1న లాంఛనంగా మొదలైంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుంది. ‘దృశ్యం’లో నటించిన మీనా, నదియా మరోసారి కనిపిస్తారు.

వెంకటేష్ ఒకవైపు “ఎఫ్ 3” సినిమా షూటింగ్ చేస్తూనే ఇది కూడా మొదలు పెట్టాడు. ఈ ఏడాది వెంకటేష్ నుంచి మూడు సినిమాలు విడుదలవుతాయి. మే నెలలో “నారప్ప”, ఆగస్టులో “ఎఫ్ 3”, అలాగే ఏడాది చివర్లో “దృశ్యం 2”.

More

Related Stories