
మూడు నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపిన సంగీత దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు. ఒకానొక దశలో టాలీవుడ్ లో ఏ సినిమాకి మ్యూజిక్ ఇవ్వాలన్నా.. ముందుగా దేవిపేరు వినిపించేది. తన పాటలు, మ్యూజిక్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించే రాక్‌స్టార్.. ఈ మధ్య ఎందుకో కాస్త స్లో అయ్యాడు.
థమన్ ఊపులో దేవి వెనకపడ్డాడు అనిపించింది. ఐతే, “పుష్ప” సినిమా పాటలతో దేవిశ్రీ మళ్ళీ తన సత్తా ఏంటో చూపాడు. ఈ సినిమాకి జాతీయ అవార్డు అందుకున్నాడు. ఇప్పుడు మళ్లీ దేవి టైం వచ్చినట్టుగానే కనిపిస్తోంది. ఎందుకంటే… ఇప్పుడు డైరెక్టర్లంతా ఒక్కొక్కరుగా తిరిగి దేవీని ఎంచుకుంటున్నారు.
ఇప్పుడిప్పుడే మళ్లీ దేవీ కోసం డైరెక్టర్లు క్యూ కడుతున్న పరిస్థితి.
సుకుమార్ (పుష్ప 2), హరీష్ శంకర్ (ఉస్తాద్ భగత్ సింగ్)ల చిత్రాలే కాకుండా మరికొన్ని ప్రాజెక్టులు దేవి చేతికి వచ్చాయని టాక్. శేఖర్ కమ్ముల కూడా మొదటి సారి తన సినిమాకు మ్యూజిక్ అందించే బాధ్యతను దేవి చేతిలో పెట్టారట. ఈ క్రమంలోనే చందు మొండేటి – నాగ చైతన్య కాంబినేషన్ లో రూపొందనున్న మూవీ కూడా దేవికే వెళ్ళింది అని టాక్. మొత్తానికి దేవీ ఈజ్ బ్యాక్ అన్నమాట.