రామ్ సినిమాకి డీఎస్పీ

Devi Sri Prasad

కీరవాణి రాజమౌళి సినిమాలకు, దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ సినిమాలకు మాత్రమే బెస్ట్ మ్యూజిక్ ఇస్తున్నారిప్పుడు. మిగతా దర్శకులతో వీరు పనిచేసినప్పుడు అలాంటి మ్యాజిక్ జరగడం లేదు. అందుకే, డీఎస్పీకి ఇటీవల పెద్ద సినిమాల ఆఫర్లు తగ్గాయి.

ఐతే, ‘ఉప్పెన’ సినిమా సక్సెస్ లో డీఎస్పీ మ్యూజిక్ దే ప్రధాన పాత్ర పోషించింది. సో, మళ్ళీ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ మేజిక్ కోసం లైన్లోకి వచ్చారు దర్శక, నిర్మాతలు. ఆలా సెట్ అయిందే… రామ్ పోతినేని కొత్త చిత్రం.

చాలా గ్యాప్ తర్వాత రామ్ హీరోగా నటించే సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. దర్శకుడు లింగుస్వామి రామ్ హీరోగా తీస్తున్న కొత్త సినిమాకి డీఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యారు. ఆ విషయాన్ని టీం అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి నటిస్తోంది.

గతంలో రామ్ నటించిన జగడం, రెడీ, నేను శైలజ వంటి సినిమాలకు సూపర్ మ్యూజిక్ ఇచ్చారు దేవిశ్రీప్రసాద్.

More

Related Stories