‘సింగం’ గొంతు మూగబోయింది

ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో చనిపోయారు. చెన్నైలోని తన నివాసంలోనే శ్రీనివాస మూర్తి తుదిశ్వా స విడిచారు.

ఆయన ముఖం, ఆయన పేరు సామాన్య ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు. కానీ ఆయన గొంతు వినని తెలుగు ప్రేక్షకులు లేరు. తమిళ హీరో సూర్య, అజిత్, విక్రమ్ వంటి స్టార్స్ కి ఆయన డబ్బింగ్ చెప్తుంటారు.

ముఖ్యంగా సూర్య హీరోగా నటించిన ‘యముడు’, ‘సింగం’ వంటి సినిమాల్లో ఆయన చెప్పిన తెలుగు డబ్బింగ్ అదుర్స్. సూర్య ఆవేశానికి పర్ఫెక్ట్ గా డబ్బింగ్ చెప్పారు శ్రీనివాస మూర్తి. అలాగే, ‘జనతా గ్యారేజ్’లో మోహన్ లాల్ కి తెలుగు డబ్బింగ్ చెప్పింది ఆయనే.

పేరున్న హీరోలకే కాదు అనేక డబ్బింగ్ సినిమాల్లో ఆయన గొంతు విప్పారు. వందల చిత్రాలకు ఆయన తన గొంతు ఇచ్చారు. నటుడిగానూ కొన్ని చిత్రాల్లో నటించారు.

 

More

Related Stories