అమెరికాలో కలెక్షన్లు డల్

Sankranthi Movies 2021

సంక్రాంతి సినిమాలు అన్నీ థియేటర్లలోకి వచ్చాయి. “క్రాక్”, “మాస్టర్” సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. “రెడ్”, “అల్లుడు అదుర్స్” ఈ రోజు విడుదల అయ్యాయి. అమెరికాలో అన్ని సినిమాలు ఇప్పటికే రన్ అవుతున్నాయి. ఐతే, ఏ ఒక్క సినిమాకి కూడా అమెరికాలో చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదు. ప్రీమియర్ షోలలో అయినా, మామూలు షోలలో అయినా సేమ్ సీన్.

ఒకప్పుడు మొదటి మూడు రోజుల్లోనే మిలియన్ డాలర్లు పొందిన సినిమాలు అంటూ గొప్పలు చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు 1 లక్ష డాలర్లు వస్తే గగనం అన్నట్లుగా మారింది. విడుదలయి నాలుగు రోజులు అయినా “క్రాక్” లక్ష డాలర్ల మార్క్ అందుకోలేదు.

విజయ్ వంటి పెద్ద స్టార్ ఉన్నా కూడా “మాస్టర్”కి వచ్చిన ఓపెనింగ్ అంతంత మాత్రమే. రామ్ నటించిన “రెడ్”, “అల్లుడు అదుర్స్”లు కూడా ప్రీమియర్ షోలతో పెద్దగా వసూళ్లు రాబట్టే సీన్ లేదు.

అమెరికా మార్కెట్ ఇంకా పూర్తిగా ఓపెన్ కాలేదు. తెలుగు సినిమాల వసూళ్లు వేసవికి గాని పుంజుకునే పరిస్థితి లేదు.

More

Related Stories