‘తోడేలు’కి స్పందనే లేదు

Todelu


భారీ ప్రచారం జరిగింది ‘తోడేలు’ సినిమాకి. ‘భేడియా’ అనే హిందీ సినిమాకి అనువాద రూపం…. తోడేలు. తెలుగులో ఈ సినిమాని భారీ ఎత్తున విడుదల చేశారు నిర్మాత అల్లు అరవింద్. ‘కాంతార’ సినిమాని ఆయనే విడుదల చేసి కళ్ళు చెదిరే విజయం అందుకున్నారు. అదే ఊపులో ‘భేడియా’ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.

వరుణ్, కృతి సనన్ హైదరాబాద్ కి విచ్చేసి ప్రచారం కూడా చేశారు. కానీ, ఈ సినిమాకి స్పందన లేదు. కలెక్షన్లు లేవు.

హిందీ వర్షన్ కి విమర్శకుల నుంచి మంచి రివ్యూస్ వచ్చాయి. కానీ హిందీ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపడం లేదు. డల్ గా ఉన్నాయి కలెక్షన్లు.

ఇటీవల హిందీ సినిమాలకు పెద్దగా కలెక్షన్లు ఉండడం లేదు. దక్షిణాది చిత్రాలు గ్రాఫిక్స్, భక్తిరసం, ఇంకా ఇతర హడావిడితో కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. అదే పంథాలో భారీ గ్రాఫిక్స్ హంగామాతో ‘తోడేలు’ తీశారు. కానీ, రెస్పాన్స్ ఉండడం లేదు. బాలీవుడ్ దర్శక, నిర్మాతలు, తారలకు ఇది చాలా కష్టకాలం.

అమీర్ ఖాన్ కూడా రెండేళ్ల పాటు సినిమాల్లో నటించను అని ప్రకటించారు.

Advertisement
 

More

Related Stories