హిట్ కొట్టిన దుల్కర్

Kurup


సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలైన మలయాళ పెద్ద చిత్రం… కురుప్. ఇది పెద్ద హిట్ అయింది. దుల్కర్ సల్మాన్ నటించిన ఈ మూవీ ఒకేసారి మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అయింది. దుల్కర్ కి కేరళతో పాటు తమిళనాడు, ఆంధ్రపదేశ్, తెలంగాణాలో మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే, స్ట్రయిట్ తెలుగు (మహానటి), తమిళ చిత్రాల్లో నటించారు దుల్కర్. దాంతో, ఈ సినిమాకి అన్ని భాషల్లో మంచి ఓపెనింగ్ వచ్చింది.

మలయాళ వర్షన్ దుమ్ము రేపుతోంది బాక్సాఫీస్ వద్ద. తెలుగునాట ఈ సినిమా దాదాపు 2 కోట్ల రూపాయల వసూళ్లు అందుకొంది. మిగతా తెలుగు చిత్రాల కన్నా గత వీకెండ్ ఎక్కువ వసూలు చేసింది ‘కురుప్’. ఇక తమిళనాడులో కూడా విజయం సాధించింది.

‘కురుప్’ సినిమాతో దుల్కర్ సల్మాన్ రేంజ్ పెరిగింది. అతనికి సౌత్ ఇండియా అంతా మార్కెట్ ఏర్పడినట్లే. అమెరికా వంటి ఓవర్సీస్ మార్కెట్ లో కూడా మంచి కలెక్షన్లను రాబట్టగలిగారు దుల్కర్ అంటే అతని స్టార్డం పెరిగినట్లే.

ప్రస్తుతం అతను తెలుగులో కూడా హీరోగా ఒక మూవీ చేస్తున్నాడనేది తెలిసిన విషయమే. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘మహానటి’ సినిమా నిర్మాతలు ఒక ప్రేమకథ తీస్తున్నారు. ఈ సినిమాలో అతనిది లెఫ్టినెంట్ రామ్ పాత్ర. బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ ఈ మూవీతో తెలుగు చిత్రరంగానికి పరిచయం అవుతోంది.

Advertisement
 

More

Related Stories