- Advertisement -

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రాన్ని నమో క్రియేషన్స్ పతాకంపై ఆర్ఎం నిర్మిస్తున్నారు. రవి చరణ్ దర్శకత్వం వహిస్తున్నారు.
పూర్తిగా డంపింగ్ యార్డ్ లో సాగే కథతో మూవీ తెరకెక్కిస్తున్నారట. దీనికోసం ఏకంగా 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్ ని వేశారు.
“నా మొదటి సినిమా నల్లమల. ఈ నవాబ్ మూవీ కొత్త తరహా ప్రయత్నం. మా హీరో ముఖేష్ గుప్తా తెలుగు వారు కాదు. ఆర్నెళ్లు తెలుగు నేర్చుకుని అద్భుతంగా నటిస్తున్నారు,” అన్నారు దర్శకుడు రవి చరణ్.
ఒరిజినల్ డంప్ యార్డ్ లో షూటింగ్ చేయడం కష్టం. అందుకే 12 ఎకరాల్లో సెట్ వేశారట. చెత్త కోసం సెట్ వెయ్యడం ఇదే మొదటి సారి. అనన్య నాగళ్ళ అందచందాలు ఈ సినిమాకి ఒక ఆకర్షణ.