రెండేళ్ల తర్వాత రెండో సినిమా

దివ్యంశ కౌశిక్ పేరు విన్నారా? చాలా మంది మర్చిపోయి ఉంటారు. ‘మజిలీ’ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించింది. చూడగానే బాగుంది అనిపించే ఫేస్. సినిమా కూడా హిట్టయింది. ఐతే, ఆ సినిమా మొత్తం సమంత డామినేట్ చేసింది. దాంతో ఈ అమ్మడికి  మరో పెద్ద అవకాశం రాలేదు.

రెండేళ్ల తర్వాత దివ్యంశ కౌశిక్ కి ఇప్పుడు అవకాశం వచ్చింది.

రవితేజ నిన్న ఉగాదినాడు లాంచ్ చేసిన కొత్త సినిమాలో మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ పొందింది. శరత్ మండవ డైరక్షన్లో రవితేజ ఒక మూవీ స్టార్ట్ చేశాడు. ఇందులో ఇద్దరు హీరోయిన్లుంటారు. ఒక భామగా దివ్యంశ కౌశిక్  నటిస్తోంది. ఇది పెద్ద సినిమానే ఈ అమ్మడికి. రెండో అఫర్ కొట్టేందుకు ఇంత టైం పట్టడమే విశేషం.

More

Related Stories