‘పార్ట్ 2’ లిస్ట్ పెరుగుతోంది!

- Advertisement -
Eagle

స్కంద .. స్కంద 2
పెద కాపు … పెద కాపు
సలార్… సలార్ 2
“హనుమాన్”.. జై హనుమాన్
సైంధవ్… సైంధవ్ 2

ఇలా ఇటీవల విడుదలైన ప్రతి సినిమాకి చివర్లో రెండో భాగం ఉంటుంది అని హింట్ ఇచ్చారు. ఇక ఇప్పుడు “ఈగిల్” సినిమా చివర్లో కూడా అదే చెప్పారు. “ఈగిల్ 2: యుద్ధకాండ” అని సినిమా ముగుస్తుంది. అంటే రవితేజ నటించిన ఈ చిత్రానికి రెండో భాగం ఉందన్నమాట.

రవితేజ సినిమా నటించిన “ఈగిల్” ఈ రోజు విడుదలైంది. ఈ సినిమాలో హీరో ఒక మంచి పని కోసం పోరాటం చేస్తాడు. ఆ పోరాటం ఆగిపోదు. అసలైన యుద్ధకాండ రెండోభాగంలో ఉంటుంది అన్నట్లుగా సినిమా ఎండ్ అవుతుంది.

ఇక “పుష్ప”కి “పుష్ప2” రెడీ అవుతోంది. అలాగే ఎన్టీఆర్ నటిస్తున్న “దేవర” చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తామని ముందే ప్రకటించారు. అంటే ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో మొత్తం రెండో భాగాల క్రేజ్ పెరిగింది. ఆ లిస్ట్ రోజురోజుకీ పెరుగుతోంది.

ఐతే ఇటీవల విడుదలైన సినిమాల్లో “స్కంద”, “పెదకాపు”, “సైంధవ్” చిత్రాలకు రెండో భాగాలు రూపొందవు అని కచ్చితంగా చెప్పొచ్చు. అవి ఆడితే తీసే ఆలోచన చేసేవేళ్ళేమో. కానీ అవి దారుణంగా పరాజయం పొందడంతో రెండో భాగం అనే ఆలోచన కేవలం ఆలోచనగానే మిగిలిపోయింది.

“హనుమాన్”కి సీక్వెల్ గా ‘జై హనుమాన్”, “సలార్”కి రెండో భాగం తయారు అవుతాయి.

 

More

Related Stories