డిసెంబర్ 20న ‘ఈగల్’ ట్రైలర్

- Advertisement -
Eagle

సంక్రాంతి బరిలో ఉన్న చిత్రం… ‘ఈగల్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న మూవీ ఇది. ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా రాదా అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ టీం ప్రమోషన్స్ మొదలుపెట్టింది.

ఇక “ఈగల్” ట్రైలర్ గురించి తాజాగా అప్డేట్ వచ్చింది. ట్రైలర్ డిసెంబర్ 20న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో రవితేజ మల్టిపుల్ షేడ్స్ ఉన్న పాత్రలో అలరించనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుండగా, కావ్య థాపర్ మరో కథానాయిక.

టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల చేస్తున్నామని నిర్మాతలు మరోసారి స్పష్టం చేశారు.

More

Related Stories