ఆడి ఆడని సినిమాకు సీక్వెల్!

Vishwak Sen

ఓ సినిమా హిట్టయితే దానికి సీక్వెల్ తీయడానికి మేకర్స్ ఆసక్తి చూపిస్తారు. “ఎఫ్2″కు ఆల్రెడీ సీక్వెల్ వచ్చింది. “హిట్” అనే చిత్రానికి సీక్వెల్ వస్తోంది. అయితే పెద్దగా ఆడని సినిమాకు సీక్వెల్ తీయాలని ఎవరైనా అనుకుంటారా? మరీ ముఖ్యంగా సురేష్ బాబు లాంటి నిర్మాత అలాంటి ఆలోచన చేస్తాడా?

సురేష్ బాబు నిర్మాతగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమా థియేటర్లలో వసూళ్లు అయితే రాబట్టుకొంది. కానీ, అది పెద్ద విజయమేమి కాదు. అయినప్పటికీ ఇప్పుడా సినిమాకు సీక్వెల్ తీస్తానని ప్రకటించాడు తరుణ్ భాస్కర్. 2024లో విశ్వక్ హీరోగా “ఈ నగరానికి ఏమైంది” సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు.

అంతే కాదు, ఈ సినిమా పెద్దగా ఆడలేదు కదా అంటే తరుణ్ ఒప్పుకోవడం లేదు. ఆ సినిమా ఎందుకు థియేటర్లలో ఆడలేదో తనకు అర్థం కాలేదని, ఇప్పటికీ చాలామంది ఆ సినిమా చూసి బాగుందని తనకు చెబుతుంటారని, సీక్వెల్ తీయమని కూడా తనను కోరారని అంటున్నారు.

తరుణ్ భాస్కర్ ఆలోచన బాగానే ఉంది కానీ, ఇలాంటి సినిమాకు సీక్వెల్ తీయడానికి నిర్మాత సురేష్ బాబు ఒప్పుకుంటాడా అనేది అనుమానం

 

More

Related Stories