కాల్ గర్ల్ పా త్రలో ఈషా

- Advertisement -
Eesha Rebba

మరో ఛాలెంజింగ్ పాత్రలో కనిపించబోతోంది ఈషా రెబ్బ. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ తెలుగు పిల్ల, ఓ కాల్ గర్ల్ పాత్రలో కనిపించబోతోంది.

దర్శకుడు సంపత్ నంది ఓ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాడు. తన దగ్గర చాన్నాళ్లుగా వర్క్ చేస్తున్న అశోక్ అనే కుర్రాడికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించబోతున్నాడు. మెట్రో సిటీ బ్యాక్ డ్రాప్ లో అల్లిన ఈ కథలో వేశ్యగా కనిపించబోతోంది ఇషా రెబ్బ. ఓ కాల్ గర్ల్ జీవితంలో మూడు దశల్లో జరిగిన వివిధ ఘటనల్ని ఈ వెబ్ సిరీస్ లో చూపించబోతున్నారు.

ఆల్రెడీ ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తోంది ఈషా రెబ్బా. త్వరలోనే స్ట్రీమింగ్ కు రాబోతున్న “లస్ట్ స్టోరీస్” వెబ్ సిరీస్ లో స్వయంతృప్తి పొందే గృహిణి పాత్రలో కనిపించబోతోంది. ఇప్పుడు కాల్ గర్ల్ క్యారెక్టర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

 

More

Related Stories