హీరోగా రక్షిత తమ్ముడు రానా

‘ఇడియట్’ వంటి సినిమాల్లో నటించిన రక్షిత నిర్మాతగా మారారు. ఆమె నిర్మిస్తున్న ‘‘ఏక్ లవ్ యా’’ అనే సినిమాతో ఆమె తమ్ముడు రానా హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషలతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. ఈ మూవీకి రక్షిత భర్త, కన్నడ స్టార్ డైరెక్టర్ జోగి ప్రేమ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సినిమా మొదటి లుక్ విడుదలైంది. రానా సిక్స్ ప్యాక్ తో ఫస్ట్ లుక్ లో దర్శనమిచ్చాడు. ప్రేమికుల రోజు సందర్భంగా ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేస్తోంది టీమ్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో నాలుగు భాషల్లో రిలీజ్ కానుంది.

More

Related Stories