
“పలాస 1978’తో పేరు తెచ్చుకున్న హీరో… రక్షిత్ అట్లూరి. ఇక కోమలి గురించి పరిచయం అక్కర్లేదు. ఇద్దరూ తెలుగువాళ్లే. వీరు ప్రేమికులుగా చిత్రం ‘శశివదనే’.
ఈ చిత్రం ఏప్రిల్ 5న గ్రాండ్ రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి “ఏమిటో ఏమిటో..” అనే పాటను విడుదల చేశారు.
హీరోయిన్‌పై మనసుపడ్డ హీరో తన మనసులో చేలరేగె భావాలను పాట రూపంలో వ్యక్తం చేసే క్రమంలో పాట వచ్చే సందర్భంగా అనిపిస్తోంది. పి.వి.ఎన్.ఎస్.రోహిత్ పాడిన ఈ పాటను కరుణాకర్ అడిగర్ల రాశారు. శరవణ వాసుదేవన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల ఈ చిత్రాన్ని నిర్మించారు. సాయి మోహన్ ఉబ్బన దీనికి దర్శకుడు. కోనసీమ అందాలు ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ.