సమతూకం కోసం కష్టాలు!

Waltair Veerayya and Veera Simha Reddy

వాల్తేర్ వీరయ్య, వీర సింహ రెడ్డి… రెండూ ఒకే సంస్థ నిర్మిస్తున్న చిత్రాలు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలు సంక్రాంతి కానుకగా రానున్నాయి. సాధారణంగా ఒకే సంస్థ తీసిన రెండు పెద్ద చిత్రాలు ఒకేసారి విడుదల కావు. ఇలాంటి అరుదైన సీను సంక్రాంతికి చూడనున్నాం.

ఐతే, నిర్మాతలకు మాత్రం చాలా తలనొప్పులున్నాయి. ‘వాల్తేర్ వీరయ్య’లో హీరో చిరంజీవి. ‘వీర సింహ రెడ్డి’లో టైటిల్ రోల్ బాలయ్యదే. మరి వీరి అభిమానులు సైలెంట్ గా ఉంటారా? రెండు సినిమాలు పోటీ పడుతున్నప్పుడు పబ్లిసిటీ కూడా అదే రేంజులో ఉండాలని ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఈ రోజు ‘వాల్తేర్ వీరయ్య’ నుంచి ‘బాస్ పార్టీ’ అనే పాట వచ్చింది.

మరి, ‘వీర సింహ రెడ్డి’ పాటల విడుదల ఎప్పుడు? అంటూ బాలయ్య అభిమానులు గోల మొదలు పెట్టారు.

రిలీజ్ వరకు ఇద్దరి హీరోల అభిమానులను మెప్పించడం కత్తిమీద సాము నిర్మాతలకు.

 

More

Related Stories