‘నా కలర్ వల్లే ఛాన్సులు తగ్గాయి’

హీరోయిన్ ఇషా గుప్తా సెక్సీ ఫొటోలతో హల్చల్ చేస్తుంటుంది. ఆమెకి బాలీవుడ్ లో, తెలుగులో (‘వినయ విధేయ రామ’) కూడా మంచి అవకాశాలే వచ్చాయి. ఐతే, తనకున్న అందచందాలకు, తన శరీర సౌష్టవానికి ఇంకా ఎక్కువ గుర్తింపు రావాలి అనేది ఆమె ఫీలింగ్.

కేవలం ఎర్రగా ఉండడం వల్లే బాలీవుడ్ లో పలువురు భామలకు ఎక్కువ ఛాన్సులు వచ్చాయట. తాను నల్లగా ఉండడంతో పట్టించుకోలేదు అని చెప్తోంది ఇషా గుప్తా.

“ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా బాలీవుడ్ లో కలర్ వివక్ష ఉంది.”నా కలర్ వల్లే ఛాన్సులు తగ్గాయి. ఫెయిర్ గా ఉంటేనే అందం అనుకునే వాళ్ళు ఎక్కువ. బాలీవుడ్ లో టాలెంట్ కన్నా ఎర్రగా ఉండడం ముఖ్యం. దానివల్ల నాలాంటి నల్లగా ఉండే అమ్మాయిలకు సరైన ఆఫర్లు రావడం లేదు. ఈ పద్దతి మారాలి. కొంతలో కొంత దక్షిణాది చిత్రసీమ బెటర్,” అనేది ఆమె మాట.

రంగు ముఖ్యమా పొంగు ముఖ్యమా? అని ప్రశ్నిస్తోంది. తాజాగా ఆమె తన బికినీ సోయగాల వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. నలుపు కాదు నా సోయగాల సంపద చూడండి అంటోంది. ఈ వీడియో చూసైనా మీ అభిప్రాయాన్ని మార్చుకోండి అని ఫిలిం మేకర్స్ కి చెప్తోంది కాబోలు.

 

More

Related Stories