బన్నీకి అన్నీ కలిసొస్తున్నాయా?


అల్లు అర్జున్ నక్క తోక తొక్కాడు. ‘పుష్ప’ సినిమా హిందీ మార్కెట్ లో ఒక మేనియా క్రియేట్ చెయ్యడం ఎవరూ ఊహించనిది. ఎటువంటి హడావిడి లేకుండా విడుదల చేస్తే… ఆ సినిమా అక్కడ బాగా ఆడడమే కాదు సెలెబ్రిటీల నుంచి ట్వీట్లు, ప్రచారం కూడా వచ్చింది.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా బన్నీ సినిమాకి ప్రచారం కల్పిస్తోంది. “అందరూ మాస్క్ ధరించాలి” అనే ప్రచారం కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా పుష్ప పోస్టర్ ని వాడుకొంది

“డెల్టాహో.. యా ఒమిక్రాన్ మై మాస్క్ ఉతరేంగా నహీ” అంటూ పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ ఫోటోకి మాస్క్ పెట్టి మరీ ప్రచారానికి వాడుకొంటుంది.

Pushpa

మొన్నామధ్య అమూల్ కూడా ‘పుష్ప’ మీద కార్టూన్ ని విడుదల చేసింది. ‘బాహుబలి’ తర్వాత ఈ గౌరవాన్ని పొందిన మూవీ ‘పుష్ప’నే.

ఇప్పుడు ‘అల వైకుంఠపురంలో’ సినిమా కూడా హిందిలో డబ్ అయి విడుదల కానుంది. టైం బాగుంటే… అన్ని వర్కౌట్ అవుతాయి. “ఆర్ ఆర్ ఆర్ ఆర్”, “రాధేశ్యామ్” చిత్రాలు వాయిదా పడడం, రణవీర్ సింగ్ సింగ్ నటించిన “83” ఆడకపోవడం కూడా “పుష్ప”కి హిందీ మార్కెట్ లో ఎదురులేకుండా పోయింది.

“పుష్ప 2″కి కావల్సినంత హైప్ వచ్చేసింది. బన్నీకి అలా అన్ని కలిసొస్తున్నాయి మరి.

 

More

Related Stories