దివి మూవీ ఛాన్స్ పట్టేసింది

బిగ్ బాస్ హౌజ్ లో మరో వికెట్ పడింది. కంటెస్టెంట్ దివి, హౌజ్ నుంచి ఎలిమినేట్ అయింది. దివి ఎలిమినేషన్ అనేది చాలామంది ప్రేక్షకులకు చిన్నపాటి షాక్ ఇచ్చింది. ఈ సంగతి పక్కనపెడితే.. బిగ్ బాస్ షో చేసినందుకు దివికి ప్రమోషన్ వచ్చింది. ఆమె సినిమా ఆఫర్ అందుకుంది.

నాగార్జున స్థానంలో సమంత వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఆదివారం ఎపిసోడ్ కు కార్తికేయ గెస్ట్ గా వచ్చాడు. ఈ సందర్భంగా కార్తికేయతో మాట్లాడిన సమంత.. వరుసగా సినిమాలు చేస్తున్నావ్ కదా.. నీ మూవీలో దివికి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వాలని కోరింది. దీనికి కార్తికేయ వెంటనే ఓకే చెప్పాడు. అలా ఎలిమినేషన్ అయిన రోజునే హీరోయిన్ ఛాన్స్ అందుకుంది దివి. తను అనుకున్నది సాధించింది.

ఇంతకుముందు గంగవ్వ ఇలానే హౌజ్ ను వీడివెళ్తా.. తన సొంతింటి కలపై నాగ్ నుంచి హామీ అందుకుంది. ఇక కమెడియన్ కుమార్ సాయి అయితే హౌజ్ నుంచి వెళ్లిపోతూ, నాగ్ కు కథ వినిపించే అవకాశం అందుకున్నాడు. ఇప్పుడు దివి ఏకంగా హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది.

ఇక Bigg Boss Telugu 4 – Episode 50 హైలెట్స్ విషయానికొస్తే.. దసరా సందర్భంగా హౌజ్ కళకళలాడింది. నాగార్జున స్థానంలో సమంత రావడమే పెద్ద హైలెట్ అనుకుంటే, ఇంకా చాలా హంగామా నడిచింది. పాయల్ రాజ్ పుల్, కార్తికేయ, అఖిల్, బొమ్మరిల్లు భాస్కర్.. ఇలా చాలామంది బిగ్ బాస్ స్టేజ్ పైకొచ్చి హంగామా చేశారు. ఓవరాల్ గా ఆదివారం నాటి ఎపిసోడ్, ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందించింది. 

Related Stories