ఎక్స్ కంటెస్టెంట్లతో బిగ్ బాస్ 4!

- Advertisement -
Ex Contestants of Bigg Boss

వచ్చే ఆదివారం “బిగ్ బాస్ 4” ముగుస్తుంది. ఈ గ్యాప్ లో షోకి మంచి ఊపు తెచ్చేందుకు, ఇంట్రెస్ట్ పెంచేందుకు బిగ్ బాస్ టీం కొత్త అట్రాక్క్షన్స్ యాడ్ చేస్తోంది. లేటెస్ట్ గా అలాంటి ప్రయోగం చేసింది. మంగళవారం (డిసెంబర్ 15)లోకి పాత సీజన్ లలో పాల్గొన్న నలుగురు కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు హౌస్ లో ఉన్న అఖిల్, సోహైల్, అభిజీత్, అరియానా, హారికలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేశారు.

మొదటి సీజన్ లో పాల్గొన్న హరితేజ, రెండో సీజన్ లో ఆట రక్తికట్టించిన సింగర్ గీత మాధురి, మూడో సీజన్లో పాల్గొన్న శ్రీముఖి, అలీ రెజా గెస్ట్ లుగా వచ్చారు.

అఖిల్, సోహైల్, అభిజీత్, అరియానా, హారికలను రకరకాల పర్సనల్ ప్రశ్నలు వేసి, గేమ్ కి మజా తెచ్చారు. శ్రీముఖి, హరితేజ తమదైన ఎనర్జీతో ఈ ఎపిసోడ్ కి అందం తీసుకొచ్చారు.

 

More

Related Stories