ఎన్టీఆర్ నుంచి రాబోయే ప్రకటన ఏంటి?

మరో 4 రోజుల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు రాబోతోంది. ఎప్పట్లానే తారక్ బర్త్ డే కి ఫ్యాన్స్ హంగామా చాలా ఉండబోతోంది. పైగా ఆర్ఆర్ఆర్ రిలీజైన తర్వాత వచ్చిన పుట్టినరోజు కాబట్టి, ఈసారి సెలబ్రేషన్ కాస్త గట్టిగానే ఉంటుంది. అయితే ఫ్యాన్స్ కోసం ఎన్టీఆర్ కూడా తనవైపు నుంచి ఓ పని చేయాల్సి ఉంది. తన కొత్త సినిమాపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

ఎన్టీఆర్ అప్ కమింగ్ సినిమాలపై చాలా కన్ఫ్యూజన్ నడుస్తోంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమా ఉంటుందని అనుకునేలోపే, కేజీఎఫ్3 ప్రకటన వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో మాట్లాడాడు. ఆ వెంటనే కేజీఎఫ్3కి ఇంకా టైమ్ ఉందంటూ హోంబలే నుంచి ప్రకటన వచ్చింది.

అటు కొరటాల శివ దర్శకత్వంలో చేయాల్సిన సినిమా కూడా చాలా అనుమానాలున్నాయి. ఇందులో హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరక్ట్ ఎవరు, ఎప్పట్నుంచి సెట్స్ పైకి లాంటి అంశాలపై స్పష్టత లేదు.

ఇలా తారక్ నుంచి రాబోతున్న 2 అప్ కమింగ్ సినిమాలపై కాస్త గందరగోళం నెలకొని ఉంది. వీటిలో కనీసం ఒక్క సినిమాకు సంబంధించైనా ఎన్టీఆర్ క్లారిటీ ఇస్తే, ఫ్యాన్స్ లో జోష్ రెట్టింపు అవుతుంది. ఈసారి తన పుట్టినరోజుకు ఎన్టీఆర్ ఏదో ఒక అప్ డేట్ తో వస్తాడని ఆశిద్దాం. 

Advertisement
 

More

Related Stories