
రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో త్వరలోనే ఒక సినిమా రూపొందనుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. తాజాగా దర్శకుడు బుచ్చిబాబు రామ్ చరణ్ ని కలిశారు. ఆ సందర్భంగా తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో రూపొందే ఈ సినిమా ఒక పీరియడ్ చిత్రం. ఇందులో రామ్ చరణ్ ఒక క్రీడాకారుడిగా నటిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ చిత్రంలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది.
ప్రస్తుతం రామ్ చరణ్ ఖాళీగా ఉన్నారు. దర్శకుడు శంకర్ తీస్తున్న ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ వచ్చే నెలలో మళ్ళీ మొదలు కానుంది. సో ఇప్పుడు గ్యాప్ దొరకడంతో రామ్ చరణ్ బుచ్చిబాబుతో సిట్టింగ్ వేశారు. హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ వంటి విషయాల్లో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
“ముందుంది అసలైన పండగ” అన్నట్లుగా ట్వీట్ చేశారు బుచ్చిబాబు.