ఒరేయ్ బుజ్జిగా డీల్ ఇదే

మొన్నటివరకు దోబూచులాడిన “ఒరేయ్ బుజ్జిగా” సినిమా ఎట్టకేలకు ఓటీటీ బాట పట్టింది. రాజ్ తరుణ్-మాళవిక జంటగా నటించిన ఈ సినిమా రైట్స్ ను గంపగుత్తగా జీ గ్రూప్ దక్కించుకుంది. మొన్నటివరకు శాటిలైట్ రైట్స్ కోసం మాత్రమే చర్చలు జరిపింది ఈ సంస్థ. డిజిటల్ రైట్స్ ను “ఆహా” యాప్ దక్కించునే ప్రయత్నాలు చేసింది.

అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో.. టోటల్ మూవీని జీ గ్రూప్ దక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు లేదా అక్టోబర్ మొదటివారంలో “ఒరేయ్ బుజ్జిగా” సినిమా జీ5లో డైరక్ట్ గా రిలీజ్ అవుతోంది.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాను 13 కోట్ల రూపాయలకు జీ గ్రూప్ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. నిజం చెప్పాలంటే, రాజ్ తరుణ్ సినిమాకు ఈ డీల్ చాలా పెద్దది. ఎందుకంటే థియేట్రికల్ గా అతడికి పెద్దగా మార్కెట్ లేదు.

Related Stories