ఫ్యామిలీ సీన్లో వెంకీ, తమన్న

“ఎఫ్ 3” (F3) సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన ఫ్యామిలీ సీన్లను ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. వెంకటేష్, తమన్నలపై తీసే ఈ కామెడీ సీన్లు చాలా హైలెట్ అవుతాయంట. “F2” సినిమాకి సీక్వెల్ గా రూపొందుతోంది “F3”.

వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్న, మెహ్రీన్, రఘుబాబు, అన్నపూర్ణ, ప్రగతి, ఝాన్సీ… ఇలా మొదటి సినిమాలోని మెయిన్ టీం అంతా నటిస్తోంది. ఐతే, ఈ సినిమాలో డబ్బుల చుట్టూ కామెడీ ఉంటుందట. “F2” కన్నా కామెడీ త్రిబుల్ డోస్ లో ఉంటుంది అనేది టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టులో విడుదల కానుంది.

ఈ సినిమా డైరెక్ట్ చేస్తూనే, టైం కుదిరినప్పుడల్లా “గాలి సంపత్” అనే సినిమా దర్శకత్వ పర్యేవేక్షణ కూడా చేస్తున్నాడు అనిల్ రావిపూడి. అలాగే, ఒక వెబ్ ఫిలిం కూడా నిర్మిస్తున్నాడు.

More

Related Stories