ఎఫ్3 మొదటి రోజు వసూళ్లు

అడ్వాన్స్ బుకింగ్స్ లో ఆశించినంత జోరు కనిపించనప్పటికీ, ఎఫ్3 సినిమా మొదటి రోజు డబుల్ డిజిట్ మార్కు అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 10 కోట్ల 37 లక్షల రూపాయల షేర్ వచ్చింది. మొదటి రోజు వసూళ్లలో ఇది చెప్పుకోదగ్గ నంబరే.

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో అటుఇటుగా 63 కోట్ల రూపాయలకు  అమ్మినట్టు టాక్. ఉత్తరాంధ్ర, నైజాం ఏరియాల రైట్స్ ను దిల్ రాజు తన దగ్గరే ఉంచుకున్నారు కాబట్టి కరెక్ట్ గా లెక్క  చెప్పలేం. ఎలా చూసుకున్నప్పటికీ, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 53 కోట్ల రూపాయల వసూళ్లు రావాల్సి ఉంటుంది.

నెలాఖరు కాబట్టి ఫుట్ ఫాలో పెరగలేదని యూనిట్ భావిస్తోంది. పైగా తెలంగాణలో పదో తరగతి పరీక్షల సీజన్ నడుస్తోంది. కాబట్టి ఒకటో తేదీ నుంచి ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. అటు ఓవర్సీస్ లో ఈ సినిమా ప్రీమియర్స్ తో కలుపుకొని హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజు వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి

నైజాం – 4.06 కోట్లు
ఉత్తరాంధ్ర – 1. 18 కోట్లు
గుంటూరు – 88 లక్షలు
నెల్లూరు 62 లక్షలు
ఈస్ట్ – 76 లక్షలు
వెస్ట్ – 94 లక్షలు
కృష్ణా – 67 లక్షలు
సీడెడ్ – 1.26 కోట్లు

 

More

Related Stories