ఎఫ్3 సినిమా.. 2 రోజుల వసూళ్లు

ఎఫ్3 సినిమాకు మొదటి రోజు 10 కోట్ల 37 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇది డీసెంట్ నంబర్ అయినప్పటికీ, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే తొలి రోజు ఇంతకంటే ఎక్కువ మొత్తం రావాలనేది ట్రేడ్ లెక్క. అయితే యూనిట్ మాత్రం తమ  సినిమాకు రోజురోజుకు ఫుట్ ఫాల్ పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఇప్పుడా అంచనాలే నిజమయ్యాయి.

ఎఫ్3 సినిమాకు రెండో రోజు కూడా భారీ వసూళ్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రెండో రోజు 8 కోట్ల 40 లక్షల రూపాయల షేర్ వచ్చింది. అలా 2 రోజుల్లో ఎఫ్3కి 18 కోట్ల 77 లక్షల రూపాయల షేర్ వచ్చినట్టయింది. ఆదివారం ఈ సినిమాకు భారీ వసూళ్లు ఆశిస్తున్నారు.

కంప్లీట్ కామెడీ చిత్రం కావడంతో.. ఫ్యామిలీ ఆడియన్స్ మెల్లమెల్లగా థియేటర్లకు వస్తారని మేకర్స్ భావిస్తున్నారు.  దీనికితోడు వచ్చే వారం నుంచి రిపీట్ ఆడియన్స్ కూడా ఉంటారని ఆశిస్తున్నారు. వీళ్ల అంచనాలు నిజమైతే కనుక ఎఫ్3 బ్రేక్ ఈవెన్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు.

ఏపీ,నైజాంలో ఈ సినిమాకు 2 రోజుల్లో వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 8.16 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.23 కోట్లు
సీడెడ్ – 2.41 కోట్లు

గుంటూరు – 1.42 కోట్లు
నెల్లూరు – 0.86 కోట్లు
ఈస్ట్ – 1.28 కోట్లు
 వెస్ట్ – 1.23 కోట్లు
కృష్ణ – 1.18 కోట్లు

 

More

Related Stories