5 రోజుల్లో సగం బ్రేక్ ఈవెన్ సాధించింది

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన మల్టీస్టాటర్ కామెడీ ఎంటర్ టైనర్ ఎఫ్3. అనీల్ రావిపూడి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో మొదలైంది. అయినప్పటికీ వసూళ్లు మాత్రం బాగానే వచ్చాయి. అలా 5 రోజుల రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, తాజాగా 50శాతం బ్రేక్ ఈవెన్ సాధించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా అటుఇటుగా 63 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. కొన్ని ఏరియాల రైట్స్ దిల్ రాజు దగ్గరే ఉన్నప్పటికీ.. మార్కెట్ రేటు ప్రకారం జరిగిన ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇది. ఇప్పుడీ మొత్తంలో సగం సాధించింది ఎఫ్3 సినిమా.

విడుదలైన 5 రోజుల్లో ఈ సినిమాకు 35 కోట్ల 28 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమాకు 5 రోజుల్లో 80 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు.

ఎఫ్3 సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు దర్శకుడు అనీల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు. ఎందుకంటే, ఈ సినిమాను సాధారణ టికెట్ రేట్లపై రిలీజ్ చేశారు. అది సానుకూల ఫలితం అందించాలనేది దిల్ రాజు కోరిక. ఇక అనీల్ రావిపూడి విషయానికొస్తే, ఈ సినిమా సక్సెస్ అయితే అతడికి ఎఫ్4కి లైన్ క్లియర్ అవుతుంది.

 

More

Related Stories