
వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న మూవీ ఎఫ్3
(F3). ఈ సినిమాకి అనేక విడుదల తేదీలు ప్రకటించారు. తాజాగా మే27కి డేట్ ని మార్చారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదల ఖరారు కావడంతో ఏప్రిల్ 28న విడుదల కావలసిన F3 ఒక నెలరోజుల పాటు వెనక్కి వెళ్ళింది.
“F3” ఇలా నెల రోజులు వెనక్కి వెళ్లడం వల్ల చాలా ఇబ్బందులే ఉన్నాయి. ముఖ్యంగా అడివి శేష్ హీరోగా నటించిన “మేజర్” సినిమాకి పెద్ద సమస్య. ఈ సినిమా కూడా అనేకసార్లు వాయిదాపడి మొన్నే ఒక డేట్ ఫిక్స్ చేసుకొంది. మే 27న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
అంటే, ఇప్పుడు “F3” వర్సెస్ “మేజర్” అన్నమాట. పోటీ వద్దనుకుంటే “మేజర్” డేట్ మార్చుకోవాలి. అడివి శేష్ నటించిన సినిమాకి హిందీ, మలయాళం మార్కెట్ కూడా ముఖ్యమే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించారు. సో, పాన్ ఇండియా మార్కెట్ కావాలనుకుంటే తెలుగులో “ఎఫ్3” పోటీ పడకతప్పదు.
ఒక్క సినిమా డేట్ వాయిదా పడితే అనేక సినిమాలకు సమస్యగా మారుతోంది.