F3… నెలన్నర పాటు నిలిపివేత

F3 Shoot


“F3” సినిమా షూటింగ్ మళ్ళీ ఆగింది. ఈ నెలలో 10 రోజులు షూటింగ్ జరిపిన తర్వాత గ్యాప్ ఇచ్చారు. ఐతే, మళ్ళీ ఇప్పట్లో మొదలుపెట్టే అవకాశం లేదు. వెంకటేష్ నెల రోజుల పాటు షూటింగ్స్ కి దూరంగా ఉంటారట. వరుణ్ తేజ్ ‘గని’ సినిమాతో బిజీ. సో, సెప్టెంబర్ వరకు “F3” సినిమా షూటింగ్ ఉండదు.

స్పీడ్ గా సినిమా తీస్తాడని పేరున్న అనిల్ రావిపూడికి ఈ సినిమా విషయంలో అన్ని అడ్డంకులే తగులుతున్నాయి. అంతే కాకుండా, ఈ మూవీ ని సంక్రాంతి బరిలో నిలపాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. అందుకే… షూటింగ్ పూర్తి చెయ్యడంలో తొందరపడడం లేదు.

మరోవైపు, అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా విషయంలో కూడా కన్ ఫ్యూజన్ ఉంది. బాలయ్యతో మూవీ అనుకున్నాడు. కానీ బాలయ్య పూరి వంటి ఇతర దర్శకుల వైపుచూపు వేశారని మీడియా వార్తలు. ఐతే, రావిపూడి మాత్రం “F3” విడుదలయ్యాకే తదుపరి చిత్రం గురించి ఆలోచిద్దామని అనుకుంటున్నాడట.

వెంకటేష్ నటించిన ‘నారప్ప’ డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలైంది. ‘దృశ్యం 2’ కూడా హాట్ స్టార్ లో రిలీజ్ అవుతుంది. “ఎఫ్ 3” మాత్రమే థియేటర్లలోకి వచ్చే సినిమా.

Advertisement
 

More

Related Stories