వెంకటేష్, రావిపూడి ఆశ ఫలించేనా?

F3 Concept Poster

వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న “ఎఫ్ 3” షూటింగ్ ఆగి రెండు నెలలకు పైనే అయింది. ఈ గ్యాప్ లో వెంకటేష్ “దృశ్యం 2” సినిమా షూటింగ్ ని పూర్తి చేశాడు. ఇప్పుడు వెంకటేష్ నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి…నారప్ప. రెండోది దృశ్యం 2. ఇక వచ్చే నెల నుంచి “ఎఫ్ 3” సినిమా స్టార్ట్ చేస్తాడట.

ఐతే, వెంకటేష్ రెడీగా ఉన్నా… కరోనా రెండో వేవ్ తగ్గితే కానీ షూటింగ్స్ మొదలు కావు. వచ్చేనెల నాటికి పరిస్థితులు చక్కదిద్దుకుంటాయి అని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆశ పడుతోంది. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా వచ్చేనెల నుంచి షూటింగ్ కి సిద్ధం అయ్యేలా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

“ఎఫ్ 3” సినిమాని స్పీడ్ గా పూర్తి చేద్దామని ఆశపడ్డాడు అనిల్ రావిపూడి. కానీ కరోనా సెకండ్ వేవ్ మొత్తం తారుమారు చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న మెహ్రీన్ కూడా తొందర్లో షూటింగ్ పూర్తి అయితే… తన పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకుందామని ఆలోచనలో ఉంది. ఇటీవలే ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో నిశ్చితార్థం జరుపుకొంది.

Advertisement
 

More

Related Stories