పుష్ప 3 ఉంటుంది: ఫహద్

Fahadh and Pushpa

రెండో భాగం ఇంకా మొదలు కాలేదు. మూడో పార్టు ఉంది అని హడావుడి మొదలుపెట్టారు ఫహద్ ఫాజిల్. ‘పుష్ప’ సినిమా గురించే ఈ చర్చ. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన ‘పుష్ప’ మొదటి భాగం తెలుగులో కన్నా హిందీలో పెద్ద హిట్ అయింది. దాంతో, రెండో భాగంపై అంచనాలు పెరిగాయి.

ఈ అంచనాలను అందుకునేందుకు దర్శకుడు సుకుమార్ తను ముందు రాసుకున్న స్క్రిప్ట్ ని మార్చేసి ఇప్పుడు మరింత గ్రాండ్ గా రాసుకున్నారట. అందుకే, రెండో భాగం ఇంతవరకు సెట్స్ పైకి వెళ్ళలేదు. ఐతే, అప్పుడే ఈ సినిమా మూడో భాగం గురించి చర్చ మొదలైంది. “మూడో భాగం ఉంటుంది. సుకుమార్ వద్ద అంత సరుకు ఉంది. కథకి స్కోప్ ఉంది,”అని తాజా ఇంటర్వ్యూలో ఫహద్ ఫాజిల్ చెప్పారు.

ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించారు. మొదటి భాగం ఫహద్ ఫాజిల్, అల్లు అర్జున్ మధ్య గొడవతో ఎండ్ అయింది. రెండో భాగంలో ఇక వీరి మధ్య డైరెక్ట్ ఫైట్ ఉండాలి. కానీ, ఈ కథని మూడో భాగం వరకు కంటిన్యూ చేసే అవకాశం ఉందట. సుకుమార్ ఈ విషయంలో ఇంకా పెదవి విప్పలేదు.

Pushpa

ఫహద్ ఫాజిల్ కి తెలుగులో ఇప్పుడు మంచి క్రేజ్ పెరిగింది. “పార్టీ లేదా పుష్ప” అన్న ఆయన డైలాగ్ బాగా పాపులర్. మీమ్స్ లో కూడా వెరీ పాపులర్.

 

More

Related Stories