ఇక ఫహద్ ఫాజిల్ తెలుగులో బిజీ

- Advertisement -
Fahadh Faasil

ఫహద్ ఫాజిల్ తెలుగువాళ్లకు కూడ చేరువయ్యారు. “పుష్ప” సినిమాలో పుష్పరాజ్ కి ఛాలెంజ్ విసిరే పోలీస్ ఆఫీసర్ షెకావత్ గా ఫహద్ అదరగొట్టారు. మలయాళంలో ఆయన బిగ్ స్టార్. వెరైటీ పాత్రలకు, సహజమైన నటనకు పెట్టింది పేరు ఫహద్. “పుష్ప 2″లో నటిస్తున్నారు ఇప్పుడు.

తాజాగా ఆయన మరో రెండు తెలుగు సినిమాలు ఒప్పుకున్నారు. త్వరలోనే ఈ రెండు సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్తాయి. ఈ రెండు సినిమాల్లో ఆయన విలన్ కాదు. హీరోగానే, మెయిన్ క్యారెక్టర్లోనో నటిస్తారు. “డోంట్ ట్రబుల్ ద ట్రబుల్” అనే చిత్రంతో పాటు “ఆక్సిజన్ అనే మరో సినిమా ఒప్పుకున్నారు. ఈ రెండు సినిమాలను ఆర్కా మీడియా, షోయింగ్ బిజినెస్ బ్యానర్లపై శోబు యార్లగడ్డ, ఎస్ ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాలకు సమర్పకుడు కావడం విశేషం.

మమ్మూట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్… ఇలా మలయాళ హీరోలు, సూపర్ స్టార్లు అందరూ తెలుగులో నటిస్తున్నారు. వారి వెంట పడుతున్నారు మన మేకర్స్. మోహన్ లాల్ “జనతా గ్యారేజ్” తర్వాత మళ్ళీ నటించలేదు. మమ్మోట్టి ఇటీవలే “యాత్ర 2″లో, “ఏజెంట్”లో నటించారు. ఇక దుల్కర్ ప్రస్తుతం తెలుగులో “లక్కీ భాస్కర్” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. పృథ్వీరాజ్ “సలార్ 2″లో నటించనున్నారు.

వారి బాటలోనే ఫహద్ కూడా తెలుగులో బిజీ కానున్నారన్నమాట. ఆయన భార్య నజ్రియా కూడా ఆ మధ్య నాని సరసన “అంటే సుందరానికి” సినిమాలో హీరోయిన్ గా నటించింది.

 

More

Related Stories