ఫహద్ కి ఇస్తున్నది తక్కువే!

Fahadh Faasil


మలయాళంలో లీడింగ్ స్టార్ ఫహద్ ఫాజిల్. మన దేశంలో ఇప్పుడు అద్భుతమైన సినిమాలు చేస్తున్న చాలా అతికొద్దిమంది హీరోల్లో ఒకరు …ఫహద్ ఫాజిల్. 90 శాతం మంది మన ఇండియన్ పెద్ద హీరోలు మంచి డబ్బు ఇచ్చినా, లేదా పెద్ద దర్శకుడు, అగ్ర నిర్మాణ సంస్థ అఫర్ తో వచ్చినా వెంటనే ఒప్పేసుకుంటారు. కథ గురించి తర్వాత ఆలోచిస్తారు. కానీ ఫహద్ అలా కాదు. ఆయనకి స్క్రిప్ట్, తన పాత్ర ముఖ్యం. అందుకే మలయాళ చిత్రసీమలో ఇప్పుడు డిఫరెంట్ సూపర్ స్టార్ గా నిలబడ్డాడు.

ఫహద్ తెలుగులోకి అడుగుపెడుతున్నాడు ఇప్పుడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీస్తున్న ‘పుష్ప’ సినిమాలో విలన్ గా నటించేందుకు ఒప్పుకున్నాడు.

మరి ఇంతకు అతనికి అందుతున్న రెమ్యూనిరేషన్ ఎంతో తెలుసా.. 5 కోట్లు.

మలయాళ సినిమా రంగంలో ఒక పెద్ద హీరో తీసుకునే పారితోషికం అంతే ఉంటుంది. విలన్ పాత్రకు ఇది పెద్ద మొత్తమే. కానీ ఫహద్ వల్ల తమిళనాడు, కేరళ మార్కెట్ లో వచ్చే బెనిఫిట్ వేరు. ఆ లెక్కన చూస్తే అతని కోట్ చేసిన మొత్తం తక్కువే. పైగా…. ‘పుష్ప’ సినిమా బడ్జెట్, మార్కెట్ చేసే అమౌంట్ భారీగా ఉంటుంది.

More

Related Stories