ఆలు లేదు చూలు లేదు…కత్రినాతో!

Katrina Kaif

అసలే విజయ్ దేవరకొండ తన ప్లాన్ అంతా తారుమారు అయింది అని బాధ పడుతున్నాడు. దానికి తోడు, తనకే తెలియని సినిమాల గురించి వార్తలు వస్తున్నాయి.

‘లైగర్’ విడుదల కాగానే శివ నిర్వాణ డైరక్షన్లో ఓ మూవీ, ఆ తర్వాత సుకుమార్ తో పాన్ ఇండియా మూవీ… ఇలా ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాడు విజయ్ దేవరకొండ. కానీ గతేడాది లాక్డౌన్, ఈ ఏడాది సెకండ్ వేవ్ అతని కొంపముంచాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏ మూవీ చెయ్యాలో ఇంకా ఫిక్స్ అవ్వలేదు విజయ్ దేవరకొండ. అతనికి ఏది వర్కవుట్ కావట్లేదు అనే బాధ ఉంది.

కానీ విజయ్ దేవరకొండ నెక్స్ట్ నటించే భారీ చిత్రంలో కత్రినా కైఫ్ నటించనుంది అని ఒక బాలీవుడ్ వెబ్ సైట్ రాసింది. దాన్ని యాజిటీజ్ గా తెలుగు పత్రికలు, వెబ్ సైట్లు కాపీ కొట్టాయి. అసలే సినిమా వార్తలకు కరువు కాలం కదా! దాంతో విజయ్ సరసన కత్రినా అనగానే మన తెలుగు మీడియా రాసేసింది. అసలు విజయ్ నెక్స్ట్ మూవీ ఏంటి… ఇప్పుడు చేస్తున్న లైగర్ ఎప్పుడు పూర్తి అవుతుంది అనే విషయాలు ఏవీ పట్టించుకోలేదు ఎవరూ.

Advertisement
 

More

Related Stories