‘ఫ్యామిలీ స్టార్’ పాటల ప్రమోషన్

- Advertisement -
Family Star

వేసవి సెలవుల్లో మొదటగా రానున్న చిత్రం… ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా పాటల ప్రమోషన్ మొదలైంది.

విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన “గీత గోవిందం” మ్యూజికల్ బ్లాక్ బస్టర్. ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ వెరీ పాపులర్. అందుకే ఈ కొత్త సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా టీం పాటలతోనే ప్రమోషన్ మొదలుపెడుతుంది. మొదటి పాటగా “నందనందన” అనే సాంగ్ ని విడుదల చెయ్యనున్నారు.

ఈ పాటని విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పై హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరించారు. గోపీ సుందర్ స్వరపరిచిన ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించడం విశేషం. హీరోయిన్ మృణాల్ మినహా ఈ పాటకు మొత్తం “గీత గోవిందం” కాంబినేషన్ సెట్ అయింది.

“ఫ్యామిలీ స్టార్”లో విజయ్ దేవరకొండ మధ్యతరగతి యువకుడిగా కనిపిస్తారు. ఈ సినిమా కొంత భాగం అమెరికా నేపథ్యంగా, కొంత భాగం హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో, ఇంకొంత కాకినాడ బ్యాక్డ్రాప్ లో సాగుతుంది. దిల్ రాజు ఈ సినిమాకి నిర్మాత.

Nandanandanaa Lyrical Promo - The Family Star - Vijay Deverakonda, Murunal | Gopi Sundar | Parasuram
 

More

Related Stories