ఈ సినిమాకి కూడా సెలబ్రేషనా?

manmadhudu2 rakul

రానురాను ఏ సినిమాకు ట్రెండ్ చేయాలో, ఏ సినిమాకు ట్రెండింగ్ చేయకూడదో జనాలకు అర్థంకాకుండా పోతోంది. తమ అభిమాన హీరో సినిమా అయితే చాలు డిజాస్టర్ అయినా దాన్ని ట్రెండ్ చేయడానికి వెనకాడ్డం లేదు ఫ్యాన్స్. ఇప్పుడు నాగార్జున విషయంలో అదే జరుగుతోంది.

“మన్మథుడు-2”.. నాగార్జున కెరీర్ లో అట్టర్ ఫ్లాప్ మూవీ. ఇది ఎంత పెద్ద ఫ్లాప్ అయిందంటే.. ఈ మూవీ గురించి తర్వాత రోజుల్లో మాట్లాడ్డానికి కూడా నాగ్ ఇబ్బంది పడ్డాడు. అలాంటి సినిమా రిలీజై ఇవాళ్టికి ఏడాది పూర్తయింది.

నాగార్జున, రకుల్ జంటగా నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని తెలిసి కూడా ఫ్యాన్స్ ఊరుకోలేదు. “మన్మథుడు-2″కు ఏడాది అంటూ ట్రెండింగ్ షురూ చేశారు. ఆ చేదు జ్ఞాపకాన్ని మరిచిపోవాలని ఓ వైపు హీరో నాగార్జున, మరోవైపు డైరక్టర్ రాహుల్ రవీంద్రన్ కిందామీదా పడుతుంటే.. ఫ్యాన్స్ ఇలా పాత గాయాన్ని మళ్లీ రేపుతున్నారు. 

Related Stories