అసలు విషయం చెప్పు ‘సలార్’

Salaar

ప్రభాస్ హీరోగా నటిస్తోన్న “సలార్” చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 28న విడుదల చెయ్యలేకపోతున్నాం అంటూ నిర్మాతలు ఈ రోజు ఒక పోస్ట్ పెట్టారు సోషల్ మీడియాలో. ఐతే, కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనే విషయంలో మాత్రం మౌనమే సమాధానం.

దాంతో, ప్రభాస్ అభిమానులు నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ని ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. “డేట్ చెప్పకుండా ఈ సోది పురాణం” ఎందుకు అని కొందరి ట్వీట్స్, “అసలు విషయం (డేట్) చెప్పు” అని ఇంకొందరు ట్వీట్స్ వేశారు . ఓవర్ ఆల్ గా అందరి ప్రశ్న ఒక్కటే… కొత్త డేట్ ఎప్పుడు అనేది.

నవంబర్ 10, నవంబర్ 24, డిసెంబర్ 23…ఇలా రకరకాల డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చలామణిలో ఉన్నాయి. ఐతే, నిర్మాతలు మాత్రం పక్కాగా కన్ఫర్మ్ అయ్యాకే చెప్తాం అన్నట్లుగా ఉన్నారు.

తాజా సమాచారం ప్రకారం సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందుతోన్న “టైగర్ 3” విడుదల తేదీని బట్టి “సలార్” డేట్ ఫిక్స్ అవుతుందట. ఒక వేళ “టైగర్ 3” దీపావళి నుంచి క్రిస్మస్ కి వెళ్తే “సలార్” దీపావళికి వస్తుంది. లేదంటే క్రిస్మస్ డేట్ కి “సలార్” వెళ్తుంది.

ఐతే, ఇవన్నీ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న మాటలే. అసలు డేట్ అఫీషియల్ గా వచ్చేంతవరకు ఈ ఊహాగానాలకు అంతు ఉండదు.

Advertisement
 

More

Related Stories