మహేష్ మీసంకట్టు! లైక్ కొట్టు!!

Photo Courtesy: Flipkart ad

సూపర్ స్టార్ మహేష్ బాబు మీసం కట్టులో కూడా బాగుంటాడు అని ఆయన ఫ్యాన్స్ అంటున్నారు. ఫ్లిప్ కార్ట్ యాడ్ లో పంచె కట్టు, మీసం కట్టుతో దర్శనమిచ్చాడు. ఈ యాడ్ ప్రస్తుతం వైరల్ అయింది. క్లీన్ షేవ్ లుక్ లోనూ, మీసం కట్టు తోనూ ఈ యాడ్ లో కనిపించాడు. రెండు పాత్రల్లో దర్శనమిచ్చాడు. ఐతే, మీసం కట్టు లుక్ కే ఫాన్స్ లైక్ కొడుతున్నారు.

మహేష్ బాబు ఎప్పుడూ క్లీన్ షేవ్ లుక్ లోనే ఉంటాడు. లేదూ, మూడు, నాలుగు రోజులు షేవ్ చేసుకోకపోతే ఉండే లైట్ మీసం, గడ్డంతో కనిపిస్తాడు. ఫుల్ మీసంతో ఎప్పుడు కనిపించలేదు. “భరత్ అనే నేను” సినిమాలో ఒక పాటలో మాత్రం మీసం విగ్ తో కనిపించదు…కొన్ని సెకండ్స్. అందుకే ఈ ఫ్లిప్కార్ట్ యాడ్ లో ఇలా కోర మీసం కట్టుతో కనిపించేసరికి ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. ఈ లుక్ కిరాక్ గా ఉందంటున్నారు.

మహేష్ బాబు వచ్చే నెలల్లో “సర్కార్ వారి పాట” షూటింగ్లో పాల్గొంటాడు. పరశురామ్ డైరెక్షన్ లో రూపొందే ఈ మూవీ షూటింగ్ అమెరికాలో మొదలు అవుతుంది. గత 10 నెలలుగా మహేష్ బాబు షూటింగ్ కి దూరంగా ఉన్నాడు. ఈ లాక్డౌన్ టైంలో ఆయన షూటింగ్ లో పాల్గొన్నది ఈ ఫ్లిప్ కార్ట్ యాడ్ లోనే.

Related Stories