ఆమెని మార్చండి… వంగా ఫ్యాన్స్

సందీప్ రెడ్డి వంగాకి కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో సౌత్ ఇండియా అంతా యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ని హిందీలో ‘కబీర్ సింగ్’ అనే పేరుతో రీమేక్ చేసి బాలీవుడ్ లో మరింత నేమ్ సంపాదించాడు. ఇప్పుడు ‘యానిమల్’ పేరుతో రణబీర్ కపూర్ హీరోగా సినిమా తీస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా పరిణితి చోప్రాని తీసుకున్నాడు.

ఈ ఏడాది ఇప్పటికే పరిణితి నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఆ మూడూ పరాజయం పాలు అయ్యాయి. “ది గర్ల్ ఆన్ ది ట్రైన్”, “సైనా”, “సందీప్ ఔర్ పింకీ ఫరార్’ అనే ఈ మూడు సినిమాలకు క్రిటిక్స్ నుంచి కూడా బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. అందుకే ఆమెని మార్చండి…మంచి క్రేజున్న హీరోయిన్ ని తీసుకోండి అని సందీప్ కి మెసెజ్ లు వస్తున్నాయి.

అటు రణబీర్ ఫ్యాన్స్, ఇటు సందీప్ వంగా ఫ్యాన్స్ నుంచి సేమ్ రిక్వెస్ట్ వస్తుండడం విశేషం. ఐతే, సందీప్ వంగా ఇలాంటివి పట్టించుకోడు. తనకి విజన్ వుంది. దాని ప్రకారమే వెళ్తాడు.

More

Related Stories