‘పుష్ప 2’ టీంపై ఫ్యాన్స్ ఆగ్రహం

- Advertisement -
Pushpa 2 Shooting

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న “పుష్ప 2” సినిమా షూటింగ్ ఆగుతూ సాగుతూ వెళ్తోంది. ఇప్పటివరకు 30 శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు. మరోవైపు, ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదు ఈ టీం. దాంతో, అల్లు అర్జున్ అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది.

WakeUpTeamPushpa అనే హ్యాష్టాగ్ తో సోషల్ మీడియాని హోరెత్తించారు. నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమ షూటింగ్ అప్డేట్స్ కూడా చెప్పడం లేదు అని వాళ్లు ఆరోపిస్తున్నారు. మిగతా సినిమాల షూటింగ్ లు స్పీడ్ గా జరుగుతుంటే “పుష్ప 2” టీం సైలెంట్ గా ఉందనేది వాళ్ళ కోపం.

ఒకప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడ ఇలాగే వైల్డ్ గా రియాక్ట్ అయ్యేవారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా తమ కోపాన్ని ఇలా హ్యాష్టాగ్ లతో చూపిస్తున్నారు.

“పుష్ప 2” సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం తెలుగులో కన్నా హిందీలో పెద్ద సెన్సేషన్ అయింది. అల్లు అర్జున్ ని ఈ సినిమా పాన్ ఇండియా స్టార్ ని చేసింది. అందుకే, బన్నీ, సుకుమార్ రెండో భాగం విషయంలో స్లో అండ్ స్టడీ అన్నట్లుగా వెళ్తున్నారు.

 

More

Related Stories