వైల్డ్ డాగ్ ఫ్యాన్స్ కు నచ్చలేదు

Wild Dog

ప్రస్తుతం మనాలీలో ఉన్నాడు నాగార్జున. “వైల్డ్ డాగ్” సినిమాకు సంబంధించి అక్కడి అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నారు. మరో 10 రోజులు అక్కడే షూటింగ్. ఇదిలా ఉండగా.. మనాలీ షూటింగ్ సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేశారు

ఈ వర్కింగ్ స్టిల్స్ లో వైల్డ్ డాగ్ గా ఎన్ఐఏ ఏజెంట్ గా నాగ్ అదరగొట్టాడు. ఆ గెటప్ నాగ్ కు పెర్ ఫెక్ట్ గా సూట్ అయింది. ప్రస్తుతం ఈ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతా బాగానే ఉంది, ఈ స్టిల్స్ ను ఇలా రిలీజ్ చేయడమే అక్కినేని ఫ్యాన్స్ కు నచ్చలేదు. దీనికి ఓ రీజన్ ఉంది.

“వైల్డ్ డాగ్”కు సంబంధించి నాగ్ కంప్లీట్ లుక్ ఇంకా బయటకు రాలేదు. గతంలో రిలీజ్ చేసిన స్టిల్స్ లో ఓ స్టిల్ లో క్లోజ్ లో మాత్రమే చూపించారు. మరో స్టిల్ లో పేపర్ క్లిప్పింగ్ లో భాగంగా మాత్రమే నాగ్ ను చూపించారు. కానీ ఇలా మెషీన్ గన్ పట్టుకొని, ఫుల్ కటౌట్ పిక్చర్ ను ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు.

నాగ్ సోలో స్టిల్ ను ‘వైల్డ్ డాగ్’ పోస్టర్ కింద సెపరేట్ గా రిలీజ్ చేసి ఉంటే బాగుండేది. ఇలా వర్కింగ్ స్టిల్ పేరిట గుంపులో నాగ్ ను చూపించి ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేశారు. 

Related Stories