ఫరా ఖాన్ డైరెక్షన్లో నాగ చైతన్య

Naga Chaitanya and Farah Khan

బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ నాగ చైతన్యని డైరెక్ట్ చేస్తోంది. దీపిక పదుకొనెని బాలీవుడ్ లో స్టార్ గా మలిచిన దర్శకురాలు ఆమె. ‘ఓం శాంతి ఓం’ వంటి హిట్ సినిమాలు తీసిన ఫరా ఖాన్ తాజాగా ఒక యాడ్ కమర్షియల్ డైరెక్ట్ చేస్తోంది. ఆ బ్రాండ్ కి అంబాసిడర్ నాగ చైతన్య.

“25 ఏళ్ల క్రితం నాగార్జున నటించిన ఒక సినిమా పాటకి కొరియోగ్రఫీ అందించాను. అప్పటినుంచి నాగ్ తో స్నేహం ఏర్పడింది…అది అలా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ అద్భుతమైన కుర్రాడిని డైరెక్ట్ చేస్తున్నా,” అంటూ ఆమె చైతన్యతో దిగిన ఫోటోని షేర్ చేసింది. నాగ చైతన్య ఖాతాలో పలు బ్రాండ్స్ ఉన్నాయి. భార్య సమంతతో కలిసి కూడా కొన్ని యాడ్స్ చేస్తున్నాడు.

నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్లో ‘థాంక్యూ’ అనే మూవీ చేస్తున్నాడు. వచ్చే నెలలో శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ విడుదల అవుతుంది.

More

Related Stories