
కంచుకోట (1967), నిలువు దోపిడి (1968), దేశోద్ధారకులు (1973), తీర్పు (1975), నగ్నసత్యం (1979), హరిశ్చంద్రుడు (1981)లాంటి సినిమాలు అందించిన యు.విశ్వేశ్వరరావు కన్ను మూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు . ఆయనకు ఇద్దరు అమ్మాయిలు. ఒక కుమారుడు.
నిర్మాతగా, దర్శకుడిగా విశ్వేశ్వరరావు తెలుగు సినిమాకు ఆణిముత్యాల్లాంటి సినిమాలు తీశారు. ‘బాలనాగమ్మ’ సినిమాకు తమిళ డబ్బింగ్ హక్కులు కొని నిర్మాతగా మారారు. తన కుమార్తె శాంతి పేరుతో విశ్వశాంతి అనే సంస్థను స్థాపించి 15 తమిళ, తెలుగు డబ్బింగ్ సినిమాలు నిర్మించారు. ఆ ఉత్సాహంతో ఎన్టీఆర్ తో కంచుకోట, నిలువు దోపిడి, పెత్తందార్లు, దేశోద్ధారకులు వంటి భారీ చిత్రాలను నిర్మించి విజయవంతమైన నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు.
ఎన్.టి. రామారావు కుమారుడు మోహన కృష్ణకు విశ్వేశ్వరరావు అమ్మాయి శాంతిని ఇచ్చారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు: తీర్పు (1975), నగ్నసత్యం (1979), హరిశ్చంద్రుడు (1981, కీర్తి కాంత కనకం (1983).