ఫస్ట్ డే: మూడు సినిమాల రిజల్ట్

Sreekaram, Gaali Sampath and JathiRatnalu

శివరాత్రి నాడు మూడు తెలుగు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. అవి… శ్రీకారం, జాతిరత్నాలు, గాలి సంపత్. క్రిటిక్స్ తమ అభిప్రాయం నిన్నే తెలిపారు. రివ్యూలు సంగతి పక్కన పెడుదాం. ఇక ఇప్పుడు బాక్సాఫీస్ ఫలితాలు చూద్దాం.

జాతిరత్నాలు
చిన్న సినిమాగా విడుదలైంది. కానీ ఈ సినిమాకే ఎక్కువ ఓపెనింగ్ వచ్చింది. ఫస్ట్ డే…. తెలంగాణ, ఆంధ్ర, అమెరికా…ఇలా అంతటా బ్రహ్మాండమైన కలెక్షన్లు వచ్చాయి. అమెరికాలో ప్రీమియర్, ఫస్ట్ డే కలుపుకొని 2 లక్షల డాలర్లు వస్తోంది. ఈ మధ్యకాలంలో ఒక ఇండియన్ సినిమాకి అమెరికాలో ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్. ఏపీ, తెలంగాణలో కూడా అదిరిపోయాయి కలెక్షన్లు. మార్నింగ్ షో నుంచే సినిమా హిట్ టాక్ తెచ్చుకొంది.

శ్రీకారం
శర్వానంద్ ఇంతకుముందు వరుసగా మూడు ఫ్లాపులు ఇచ్చాడు. దాంతో ఈ సినిమాకి సాధారణ ఓపెనింగ్ వచ్చింది. ఐతే, రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఈ సినిమాకి ఫస్ట్ డే అతని కెరీర్ లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్ రావడం విశేషం. శివరాత్రి కావడంతో మార్నింగ్ షో కన్నా ఈవెనింగ్, నైట్ షోల కలెక్షన్లు బాగా వచ్చాయి. ‘శ్రీకారం’ ఈ వీకెండ్ ఎలా నిలబడుతుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి శర్వానంద్ కి మంచి ఓపెనింగ్ వచ్చింది.

గాలి సంపత్
ప్రస్తుతం లీడింగ్ డైరెక్టర్ లలో ఒకరైన అనిల్ రావిపూడి బ్రాండ్ నేమ్ ఉన్నా కూడా సినిమాకి కలిసి రాలేదు. ఎందుకో ఈ సినిమాకి సరైన ఓపెనింగ్ కనిపించలేదు. ఫస్ట్ డే… రేస్ లో పూర్తిగా వెనుకబడింది.

రాబర్ట్
‘కేజిఎఫ్’ సినిమా సక్సెస్ తో కన్నడ సినిమాలన్నీ వరుసగా క్యూ కడుతున్నాయి తెలుగులోకి. కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఆడలేదు. నిన్న మూడు తెలుగు సినిమాలతో పాటు ‘రాబర్ట్’ అనే కన్నడ మూవీ కూడా విడుదలైంది. జనం ఎవరూ దీని గురించి పట్టించుకోలేదు.

More

Related Stories