ఫైనల్ గా బొల్లమ్మకు హిట్టొచ్చింది

వర్ష బొల్లమ్మ క్యూట్ గా ఉంటుంది. కళ్ళతో మంచి ఎక్స్ ప్రెషన్లు పలికిస్తుంది. తెలుగులో మూడు సినిమాల్లో నటించినా ఆమెకి సక్సెస్ రాలేదు. దాంతో బాగా నీరసపడింది. అలాంటి టైములో వచ్చింది… “మిడిల్ క్లాస్ మెలోడీస్”. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ సరసన నటించింది ఈ భామ.

ఈ సినిమా అమెజాన్ లో గత వారం విడుదలై మంచి రివ్యూస్ రాబట్టుకొంది. ఈ సినిమాని నిర్మించిన భవ్య క్రియేషన్స్ ఇకపై ఇలాంటి సినిమాలు మరిన్ని నిర్మిస్తామని ప్రకటించింది. వర్ష బొల్లమ్మకిది తెలుగులో ఫస్ట్ హిట్.

తమిళంలో ఆమెకి “96”, “బిగిల్” వంటి హిట్స్ ఉన్నాయి. తెలుగులో “జాను”, “చూసి చూడంగానే” సినిమాల్లో నటించింది. అవి ఫ్లాప్ అయ్యాయి. ఇప్పుడు ఫస్ట్ హిట్ దక్కింది. సో.. టాలీవుడ్ లో ఆమెకి మరిన్ని అవకాశాలు రావడం గ్యారెంటీ.

More

Related Stories