
అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ‘మంగళవారం’. ఆయన మొదటి చిత్రం (RX 100) హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా నుంచి ‘గణగణ మోగాలిరా…’ విడుదల అయింది. ఈ రోజు బుధవారం నాడు ఈ ‘మంగళవారం’ మొదటి పాట విడుదల చేశారు.
జాతర నేపథ్యంలో ‘గణగణ మోగాలిరా…’ పాటను తెరకెక్కించారు. ‘కాంతారా’, ‘విరూపాక్ష’ సినిమాలతో పాపులరైన బి. అజనీష్ లోక్‌నాథ్ ఈ పాటకి సంగీతం ఇచ్చారు.
పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతోన్న సినిమా ఇది. పచ్చని పల్లెపై ఎవరి కన్నో పడటంతో మంటలు మొదలయ్యాయని, ప్రజల్లో భయం పెరిగిందని భాస్కరభట్ల సాహిత్యం ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు.
ఇది డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ అని అజయ్ భూపతి అంటున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తారు. పాయల్ రాజ్ పుత్ కి, అజయ్ భూపతికి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. ఇద్దరికీ ఇప్పుడు సక్సెస్ కావాలి.