
రేపు పవన్ కళ్యాణ్ 50వ పుట్టిన రోజు. పవర్ స్టార్ కి వెరీ స్పెషల్ బర్త్ డే. అందుకే, ఆయనతో సినిమాలు తీస్తున్న, తీయబోతున్న మేకర్స్ అందరూ రేపు చాలా హడావిడి చేస్తున్నారు. తమ సినిమాల అప్డేట్లు, పోస్టర్లు, పాటలు, ప్రకటనలతో హోరెత్తిస్తారు. రేపు సోషల్ మీడియా అంతా పవర్ ఫుల్ హంగామా ఉంటుంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘భీమ్లా నాయక్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి తొలి [పాట వస్తుంది. ఈ పాటతో రేపు పవన్ కళ్యాణ్ బర్త్ డే హంగామా షురూ. ఆ తర్వాత “హరి హర వీరమల్లు” సినిమా అప్డేట్ ఉంటుంది. ఇది షూటింగ్ దశలోనే ఉంది. ఈ రెండు సినిమాలతో పాటు త్వరలో ప్రారంభం అయ్యే సినిమాలకు సంబంధించిన ప్రకటనలు కూడా వస్తాయి.
హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ మరోసారి చేతులు కలుపుతున్నారు. వీరి కాంబినేషన్ లో రూపొందే కొత్త మూవీ నుంచి ఒక ప్రీ లుక్ పోస్టర్ వస్తుంది. అలాగే, దర్శకుడు సురేందర్ రెడ్డి తీసే సినిమా ప్రకటన కూడా రానుంది. ఈ సినిమాని రామ్ తాళ్లూరి నిర్మిస్తారు.