- Advertisement -

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో విలన్ గా, అక్షయ్ కుమార్ ‘రామ సేతు’లో కీలక పాత్ర, మరోవైపు హీరోగా సినిమాలు. ఇలా తన కెరీర్ ని వైవిధ్యంగా తీర్చిదిద్దుకుంటున్నారు సత్యదేవ్.
తాజాగా “ఫుల్ బాటిల్” అంటూ మరో చిత్రం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి సత్య దేవ్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో అతని పాత్ర పేరు మెర్క్యూరీ సూరి.
కాకినాడ బ్యాక్ డ్రాప్ లో సాగే మూవీ ఇది.
‘తిమ్మరుసు’ సినిమ తరువాత సత్యదేవ్, దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి కలిసి చేస్తోన్న రెండో చిత్రమిది. షూటింగ్ పూర్తయింది. త్వరలోనే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారట.