
బిబిసి స్టూడియోస్ నిర్మించిన యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి న వెబ్ ‘గాలివాన’. రాధికా శరత్ కుమార్, డైలాగ్ కింగ్ సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ ఒరిజినల్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి సిద్ధమైంది.
చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, శరణ్య ప్రదీప్, అశ్రిత, అర్మాన్, నందిని రాయ్, తాగుబోతు రమేష్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. టైటిల్, పాత్రలను వెల్లడించే మోషన్ పోస్టర్‌ను Zee 5 ఈరోజు విడుదల చేసింది. ఈ వెబ్ సిరీస్ కథ ఏంటి ? రిలీజ్ ఎప్పుడు చేస్తారు అనేది Zee5 త్వరలోనే తెలియజేస్తుందట.
బిబిసి స్టూడియోస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
శరణ్ కొప్పిశెట్టి దీనికి దర్శకుడు. ఇంతకుముందు ‘కిరాక్ పార్టీ’, ‘తిమ్మరుసు’ అనే రీమేక్ చిత్రాలు తీశాడు. ఇప్పుడు రీమేక్ వెబ్ సిరీస్ తీస్తున్నాడు.