రెండు నెలల్లో గుమ్మడికాయ!

Ram Charan

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ.. గేమ్ ఛేంజర్. ఈ సినిమాకి ఇంకా విడుదల తేదీ ప్రకటించలేదు. కానీ షూటింగ్ కి ముగింపు పలికే టైం వచ్చింది.

ఈ సినిమాకి కొబ్బరి కాయ కొట్టింది… సెప్టెంబర్ 2021లో
ఇక గుమ్మడికాయ కొట్టబోతున్నది… మే 2024లో

అవును “గేమ్ ఛేంజర్” షూటింగ్ ని మరో రెండు నెలల్లో పూర్తి చెయ్యాలని దర్శకుడు ఫిక్స్ అయ్యారు. ఇటీవలే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో కొత్త సినిమాని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ని జూన్/జులైలో మొదలుపెట్టనున్నారు. ఈలోపే శంకర్ “గేమ్ ఛేంజర్” షూటింగ్ పూర్తి చేసి రామ్ చరణ్ ని వదలాలి. ఆ తర్వాత చరణ్ కొంత మేకోవర్ చేసుకొని బుచ్చిబాబు సినిమా మొదలుపెడుతారు.

రాజమౌళి సినిమా “ఆర్ ఆర్ ఆర్” కోసం మూడేళ్ల టైం కేటాయించాడు రామ్ చరణ్. శంకర్ సినిమాకి కూడా మూడేళ్లు. ఇక బుచ్చిబాబు సినిమాకి ఎంత టైం పడుతుందో చూడాలి.

Advertisement
 

More

Related Stories